బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్, తాను ఎలాంటి నేరం చేయలేదని పేర్కొంటూ ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని, తనను ఇరికించడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నాడు. తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ఇస్లాం తరఫు న్యాయవాది పిటిషన్లో పొందుపర్చారు. అతను ఎప్పుడూ ఏంటి నేరం చేయలేదని పిటిషన్లో వివరించారు.
Suitcase murder: బెంగళూర్‌లో భార్యను హత్య చేసి, సూట్‌కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరీ(35)ని హత్య చేసినట్లు భర్త రాకేష్ ఖేడేకర్(36) తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాజేంద్ర చెబుతున్న వివరాల ప్రకారం.. రాకేష్ తనకు ఫోన్ చేసి, గౌరీతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు, అందువల్లే నేను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి…
Wife Poisons Husband: భార్య దురాగతానికి మరో భర్త బలయ్యాడు. వేరే వ్యక్తితో మాట్లాడ వద్దని చెప్పడమే అతడికి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఏకంగా భర్త తాగే కాఫీలో విషం కలిపి అతడిని హతమార్చాలని ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని భగేలా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అనుజ్ శర్మ మీరట్‌లో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పింకీ అలియాస్ సనాతో ఈ విషయమై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.
Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
సౌరభ్ హత్య కేసుతో పాటు ఔరయ్య, బెంగళూరు హత్యలు కూడా దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. మూడు కేసుల్లోనూ హత్యల సరళి దాదాపు ఒకేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సౌరభ్ భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌తో కలిసి అతన్ని హత్య చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో వివాహం అయిన 15 రోజులకే తన భర్త దిలీప్‌ను హత్య చేయడానికి ప్రగతి కుట్ర పన్నింది.
సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు.
బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 2, ప్లాట్‌ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించినట్లు భోజ్‌పూర్ జిల్లా…