వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతమవుతున్నాయి. ప్రియురాలు పిలిచిందని ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు.. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పిలిచి కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి గోడదూకితే చితక బాదామని ప్రత్యర్ధులు చెబుతున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నోములలో జరిగింది.చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర గాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇక్కడ చూడండి.. కొరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ యువకుడి పేరు జానయ్య. ఈ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర…
Faridabad: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలతో కలిసి ఓ మహిళను దారుణంగా చంపేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు శవాన్నీ అందులో పూడ్చి పెట్టేశారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని అసత్య ప్రచారం చేసారు.
DCCB Director Kidnap: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఓట్టన్‌సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన…
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
Extramarital affair: లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య…
Wife Kills Husband: మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని భార్య సోనమ్ హత్య చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి, కిరాయి హంతకులతో భార్య హత్య చేయించింది. ఈ హత్యకు సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహాలు ప్లాన్ చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది.
Groom killed: పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భర్తల్ని చంపడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. పలువురు మహిళలు తమ భర్తల్ని చంపుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో భార్య సోమన్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ..…