Ganja Smuggling: ములుగు రోడ్డులోని నార్కోటెక్ పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముందుగా వరంగల్ నర్సంపేట రోడ్డులో విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో ఒకరు మైనర్‌గా గుర్తించారు అధికారులు.
Prasanna Kumar Reddy: నేను కాదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు!
అదుపులోకి తీసుకున్న నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన పండు అనే వ్యక్తి సుపారితో గంజాయి రవాణాకు పాల్పడినట్లు అంగీకరించారు. ఆ వ్యక్తి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు DSP సైదులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 51.081 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 25,54,050గా అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hombale Films Mahavatar Narasimha Review: మహావతార్ నరసింహ రివ్యూ
ఈ కేసులో నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. A1గా మైనర్ బాలుడు (17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా, డొంకరాయి గ్రామం వాసి కాగా, A2 గా మైలపల్లి మోహిత్ (19), కాకన్ రోడ్, డొంకరాయి గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిగా గుర్తించారు. ఈ కేసు ద్వారా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరింత దృష్టిసారించినట్లు, రవాణాలో పాల్గొన్న ముఠాకు సంబంధించిన మిగతా వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని DSP సైదులు తెలిపారు.