The Girlfriend: తన గర్ల్ ఫ్రెండ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడని, ఒక వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. గర్ల్ ఫ్రెండ్‌ని ఫాలో అవ్వడం అతడికి కోపం తెప్పించింది. దీంతో, స్నేహితుడిని చంపడానికి ప్లాన్ వేసి అమలు చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగింది. 17 ఏళ్ల రెహాన్ తన స్నేహితురాలు, వసీం గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యాడు. ఇది వసీం ఆగ్రహానికి కారణమైంది.
Read Also: Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
దీంతో క్రూరమైన చర్యకు వసీం పాల్పడ్డాడు. తన ఇద్దరు స్నేహితులైన సాహిల్, రాహిల్‌లు రెహాన్‌ను చంపడానికి సహాయం చేస్తే మద్యం పార్టీ ఇస్తానని హమీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్‌ని ఫాలో అవ్వడంపై వసీం, రెహాన్ మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సాహిల్, రాహిల్‌లు రెహాన్‌కు ఫోన్ చేయమని వసీం కోరాడు. రెహాన్ వచ్చిన తర్వాత అతడికి చోలే భతురే తో పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత రెహాన్‌ను ట్రోనికా సిటి ప్రాంతంలోని ఎలైచిపూర్ గ్రామానికి తీసుకెళ్లారు. సాహిల్ రెహాన్ చేతులు పట్టుకోగా, వసిం అతడిని కత్తితో పొడిచాడు. సంఘటన తర్వాత నిందితులు పారిపోయారు. ఢిల్లీకి చెందిన రెహాన్ మృతదేహం మంగళవారం ఎలైచిపూర్ గ్రామంలో లభ్యమైంది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.