Crocodile : నదిలో స్నానం చేస్తున్న మనిషిని లాక్కెళ్లిన మొసలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది స్నానానికి వెళ్లిన ఓ 38 ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఖటోలి పట్టణంలోని పార్తి నదీతీరంలో బిల్లూ అనే వ్యక్తి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. అయితే… నది నీళ్లలో మొసలి ఉన్న విషయాన్ని గమనించని బిల్లూ నదిలోకి వెళ్లాగానే మొసలి ఒక్కసారిగా అతడిపై దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లింది.
అంతేకాకుండా.. అక్కడే స్నానం చేస్తున్న మరి కొంత మంది ఇది చూసి భయాందోళన గురవుతూ.. ఒడ్డుకు చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొలునులో స్నానం చేస్తున్న బాలుడిపై దాడిచేసిన మొసలి అతడిని చంపేసింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!