రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని గుగులోతు సీతమ్మ(32),జాట్టోతు బిచ్య(45),గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)లుగా గుర్తించారు పోలీసులు. మృతులు అందరూ పర్ష తండా కి చెందిన వారే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరో ప్రమాదంలో…
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లింగాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది వరి గడ్డితో ఉన్న ట్రాక్టర్. దీంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. మృతుడు తుంగపిండి కనకయ్య (38) గా గుర్తించారు. బావిలో నుండి ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.