Serial Killer : జైలునుంచి వచ్చిన సీరియల్ కిల్లర్.. వణికిపోతున్న గోవా మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer : ఒకప్పుడు గోవాలో సీరియల్ కిల్లర్ అంటే మహిళల్లో విపరీతమైన భయం ఉండేది. గోవా రాష్ట్రానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసేవాడు. ఆ సమయంలో మహిళల్లో భయాందోళనకు కారణమైన మహానంద్ నాయక్ 14 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 21 రోజుల పాటు ఫిరోల్ పై విడుదలయ్యాడు. దీంతో తను అరెస్ట్ కావడానికి కారణమైన బాధిత మహిళ పోలీసుల రక్షణ కోరింది.
మహానంద్ నాయక్ కొల్వాల్ ఫిరోల్ పై శుక్రవారం జైలు నుండి విడుదలయ్యారు. మహానంద నిరుపేద మహిళలపై నిఘా పెట్టి వారితో చనువు పెంచుకునేవాడు. ఆ క్రమంలోనే వారికి పెళ్లికి రప్పించేవాడు. తర్వాత పారిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇంటి నుంచి నగలు, డబ్బులు తీసుకురావాలని మహిళలను అడిగేవాడు. ఇంటి నుంచి బంగారం, డబ్బులతో వచ్చే మహిళలను నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించి ఆభరణాలు తీసుకుని గొంతుకోసి హత్య చేసి పారిపోయేవాడు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
Read Also:Madhya Pradesh: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు
ఫోండాకు చెందిన నిరుపేద మహిళతో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడానికి మహానంద్ కూడా ఆమెను ప్రలోభపెట్టాడు. ఆమెను వివాహం చేసుకోలేదని, తనను మోసం చేశాడని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసులో మహానంద్‌ను అరెస్టు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అప్పటి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సి. ఎల్. పాటిల్, డిప్యూటీ సూపరింటెండెంట్ సెరాఫిన్ డయాస్ అతని అకృత్యాల పరంపరను బట్టబయలు చేశారు. ఆ సమయంలో తాను పదహారు మంది మహిళలను ఈ విధంగా మోసం చేసినట్లు అంగీకరించాడు.
రిక్షా డ్రైవర్ నుండి సీరియల్ కిల్లర్
1995-2009 సంవత్సరాల మధ్య మొత్తం 16 నుంచి 18 మంది మహిళలను ఇలాగే హత్య చేసినట్లు వెల్లడైంది. తన ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడినందుకు అరెస్టయ్యాడు. అతను గోవాలోని ఫోండా గ్రామంలో రిక్షా నడుపుతూ ఉండేవాడు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలతో స్నేహం చేసి బంగారం దోచుకునేందుకు వారిని చంపేశానని ఒప్పుకున్నాడు. అతను 20 ఏప్రిల్ 2009న అరెస్టయ్యాడు. వాసంతి గావ్డే (19), సుశీల ఫతార్‌పేకర్ (30), యోగితా నాయక్ (30) హత్య కేసులో అతనికి మూడు జీవిత ఖైదులు, అత్యాచారం కేసులో అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.
Read Also:Bengal Panchayat Polls: ముర్షిదాబాద్‌లో బాంబు పేలుడు.. చిన్నారులు బంతి అని ఆడుకుంటుండగా..
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు