Vizag Police Caught Killer With The Help Of Bike Number: ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ.. అతని చేతిలోనే హత్యకు గురైంది. పోలీసులకు ఈ కేసు అంతుచిక్కని మిస్టరీగా మారింది. సరిగ్గా అప్పుడే పోలీసులకు ఒక చిన్న ఆధారం దొరికింది. గోడపై రాసి ఉన్న నాలుగు నంబర్లు.. ఈ కేసులో అత్యంత కీలకంగా నిలిచాయి. ఆ నంబర్ల ఆధారంగానే పోలీసులు ఈ కేసుని ఛేధించి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని తగరపువలసలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
Karnataka High Court: శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. భర్తపై కేసు కొట్టివేత..
కేరళకు చెందిన ప్రదీశ్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం విశాఖపట్నంకి వచ్చాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఇతను.. చిప్పాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలోనే ప్రదీశ్‌కి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, కొన్ని రోజుల్లోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు ఎవ్వరికీ తెలియకుండా.. తమ రాసలీలలు కొనసాగించారు. ఎప్పట్లాగే.. ఈనెల 11వ తేదీన ప్రదీశ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరు కాసేపు ఏకాంతంగా సమయం గడిపారు.
Guntur Kaaram: ఒక్క స్టిక్కర్ తో అందరి నోర్లకి తాళం వేసాడు… ఇది చాలా ఇంకా కావాలా?
అయితే.. అనుకోకుండా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న ప్రదీశ్.. ఆ మత్తులో ఆమెని భవనంపై నుంచి తోసేశాడు. అనంతరం ఇంట్లోకి తీసుకొని, ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. అంతటితో అతని కోపం చల్లారలేదు. ఆమె అవయవాలను దారుణంగా కోశాడు. అనంతరం బెడ్‌షీట్‌లో ఆమె శవాన్ని చుట్టి, బైక్‌పై తగరపువలస శివారు ఆదర్శనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. అయితే.. అతడు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ శబ్దానికి స్థానికులు లేచారు. అతని బట్టలపై రక్తపు మరకలు కనిపించడంతో.. స్థానికులకు అనుమానం వచ్చి, అతని బైక్ నంబర్ 3807ను ఒక గోడ మీద రాశారు. అతని చెప్పులు కూడా అక్కడే ఉండిపోయాయి.
Bihar: టోల్ ప్లాజా దగ్గర రూ. 50 కొట్టేశాడని సెక్యూరిటీ గార్డ్ ను చంపిన దుండగులు
మరోవైపు.. ఎంతసేపైనా ఆమె తన ఇంటికి వెళ్లకపోవడంతో, కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందారు. దీంతో.. వాళ్లు ఆమె కోసం గాలించగా, ఆమె మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అధికారులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మృతదేహం దొరికిన చోట ఆధారాలు దొరక్కపోవడంతో, ఆధారాల కోసం ఊరిలోకి వచ్చారు. అప్పుడే వాళ్లకు గోడ మీదున్న 3807 నంబర్ కనిపించింది. పోలీసులకు అనుమానం వచ్చి, ఆ కోణంలో విచారణ చేయగా.. అది బైక్ నంబర్‌గా తేలింది. బైక్ నంబర్ AP39 HK 3807గా గుర్తించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఆ నాలుగు నంబర్లు ఈ కేసులో కీలకంగా నిలిచాయి.