బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. పోలీసులు ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి ఆమె మృతదేహాన్ని వీధిలో వదిలివెళ్లాడు.
జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవలే కిడ్నప్ కు గురైన 10 నెలల పసి పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏసీపీ పండేరి చేతన్ నితిన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్ జూల్ - పార్వతి దంపతులు జిల్లా కేంద్రంలో కూలి పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు..
మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్‌ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
SP Ranganath: ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్‌షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67…
చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సరిత, వినయ్ కుమార్, నిహల్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెట్టారు. 2016లో సరిత, శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్ లో పని చేశారు.. 2016 ఏప్రిల్ లో వినయ్ కుమార్ తో శిరీష పెళ్లి సెట్ చేసింది సరిత.. శిరీష 2024 లో హయత్ నగర్ వివేరలో కూడా పని చేసింది.…
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.