Meerpet Murder Case : తెలంగాణను కుదిపేసిన మీర్‌పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ, భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా,…
Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్.. దీంతో.. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి…
Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవిడపు రాజన్న అనే వ్యక్తిని తనయుడు సాయి సిద్ధార్థ్ (సిద్దు) హత్య చేశాడు. ఈ హత్య స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సాయి సిద్ధార్థ్ తన తండ్రిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సిద్ధార్థ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఈ ఘోరానికి సిద్ధార్థ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు…
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్‌తో పాటు మరికొంత మంది…
Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో…
Hyderabad: కర్ణాటకలోని బీదర్ నగరంలోని శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో…
Double Murder : నార్సింగి జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగ్న వీడియోలు తీసేందుకు నిరాకరించినందుకు మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అంకిత్ అనే వ్యక్తికి మహిళ చెప్పడంతో.. ఉద్దేశపూర్వకంగానే మహిళని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దుండగులు హతమార్చారు. ఈ కేసులో నిందితులు రాహుల్ కుమార్ సాకేత్, రాజ్ కుమార్ సాకేత్, సుఖీంద్ర కుమార్ సాకేత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బిందు…
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.