SP Ranganath: ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నాను
- ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెల్లడి.
- ఒకరికి మరణ శిక్ష, ఆరుగురికి జీవితఖైదు ఖరారు.
- తీర్పుపై స్పందించిన నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్
- ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SP Ranganath: ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్‌షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశామని చెప్పారు.
Read Also: Justice For Pranay: కన్న కూతురు, కొడుకులను చంపే వాళ్లకు తీర్పు కనువిప్పు కావాలి
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
పరువు హత్య, కాంట్రాక్ట్ హానర్ కిల్లింగ్ కేసును చాలెంజ్‌గా తీసుకొని దర్యాప్తు జరిపాం. ప్రాసిక్యూషన్ టీమ్, మా పోలీస్ బృందాలన్నీ నిరంతరం పర్యవేక్షణలో పనిచేశాయి. 2018లోనే ఈ కేసు కష్టతరమని భావించి, హానర్ కిల్లింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు అని ఎస్పీ రంగనాథ్ గుర్తు చేశారు. కేసు విచారణలో కీలకంగా A1 ముద్దాయి మారుతీరావుతోనూ మాట్లాడినట్లు వెల్లడించారు. పరువు హత్య సరికాదని, ప్రణయ్ కూడా ఓ తల్లిదండ్రులకు కొడుకే అని గుర్తు చేసినట్లు తెలిపారు. మారుతీరావు మాత్రం తన కూతురు కోసం, తన పరువు పోతుందనే భావనతో హత్యకు పాల్పడినట్లు తెలిపారు.
హత్య అనంతరం నిందితులు తప్పించుకునేందుకు పకడ్బందీగా ప్రయత్నించినప్పటికీ, పోలీస్ బృందాలు వారిని వెంటాడి పట్టుకున్నాయని వెల్లడించారు. మేము ఈ కేసులో ఒక లక్ష్యంతో పని చేశామని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఈ కేసులో సాక్షాలు దొరకకపోయినా.. సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దర్యాప్తు కొనసాగించామని చెప్పారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేయకుండా, దర్యాప్తును చాలా జాగ్రత్తగా నిర్వహించాము. కేసు విచారణలో ఎలాంటి తప్పులూ దొర్లకుండా చూసుకున్నామన్నారు. ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరగాళ్లు అస్గర్ అలీ, అబ్దుల్లా బారీ ఇన్వాల్వ్ అయ్యారు. వారిని కూడా పట్టుకొని విచారించాము. నిందితులు రైలులో పారిపోక ముందే మన బృందాలు వారిని పట్టుకున్నాయని వివరించారు.
కేసు దర్యాప్తు పట్ల అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ, మా బృందం కఠినంగా పనిచేసింది. ఒక లక్ష్యంతో, ప్రాపర్‌గా కేసు బిల్డ్‌అప్ చేశాం. ఈ రోజు గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మర్డర్స్ చేస్తే శిక్ష తప్పదని ఈ తీర్పు ద్వారా రుజువైందని ఏవీ రంగనాథ్ అన్నారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!