Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. విజయవాడలో 3 నుండి 4 గంటల పాటు గడిపారు. ఆయన అక్కడ ఎవరిని కలిశారు? ఏం చేశారు? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది” అని వెల్లడించారు.
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ, ఉన్నతాధికారుల సూచనల మేరకు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసులు హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన మొత్తం 15 గంటల సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఆయన ఎవరితో ఉన్నారు? ఎవరిని కలిశారు? వంటి అంశాలపై వివరంగా దర్యాప్తు చేపట్టారు.
పాస్టర్ ప్రవీణ్ మృతదేహంపై నిర్వహించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఇప్పటికే అందింది. అయితే నివేదికలో పూర్తి వివరాలు అందలేదు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఇంకా విశ్లేషణ అవసరమైన కీలక అంశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని పరిశీలించగా, చేతులు, కాళ్లపై రాపిడి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గాయాలు ఎక్కడ, ఎలా ఏర్పడ్డాయి? అనేదానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Betting Gang : హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. భార్యభర్తలు అరెస్టు