సగం రేటుకే బంగారం వస్తుందంటే నమ్మేశాడు. ఏకంగా కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. రిటైల్‌గా బంగారం అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వచ్చింది. ఓ ముఠా స్మార్ట్‌గా చీట్ చేయడంతో.. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. కోటి రూపాయల బంగారం ఆర్డర్ ఇచ్చిన వ్యాపారి. సికింద్రాబాద్ పరిధిలోని ఆర్‌కే జ్యువెలరీ యజమానిని కొంత మంది ముఠా సంప్రదించింది. అతని వద్దకు నకిలీ పోలీసుల రూపంలో వెళ్లారు ఆరుగురు ముఠా సభ్యులు. వచ్చింది నిజం పోలీసులేనని జ్యువెలరీ…
Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్‌లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని…
Chandrayangutta Murder: మే 8న చంద్రాయణగుట్టలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నిందితుడు జుల్ఫికర్ ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పరుపుకు నిప్పంటించి మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని డీసీపీ పి. కాంతిలాల్ సుభాష్ తెలిపారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం రావడంతో వారు జుల్ఫికర్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఆ మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని…
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక దారుణ హత్య కేసు బయటపడింది. సౌరభ్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడితో కలిసి ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. తన భర్త మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో ప్యాక్ చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరో కేసు బయటపడింది. ఈ కేసు కూడా ఉత్తరప్రదేశ్‌కి చెందినదే. రాష్ట్రంలోని బల్లియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్…
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.
Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్…