ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డిసెంబర్ 10న జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి…
ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరగనుంది. ఇందుకోసం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అంటే 333 మంది ఆటగాళ్లను వేలంలో వేలం వేయనున్నారు. మిచెల్ స్టార్క్ 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వేలంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈసారి జరిగే వేలంపాటలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు డిమాండ్ పలుకనున్నారు.
క్రికెట్ లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్టాపింగ్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ. ఈ రూల్స్ ప్రకారం బౌలింగ్ జట్టు.. తన తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. అలా…
ఇటీవల జరిగిన ప్రపంచకప్లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ.. వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ టోర్నీలో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో షమీ ద్వారా అనుకున్న ఫలితం రాకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చూపించడంతో టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ.. మహ్మద్ షమీకి అభిమానులలో ఆదరణ ఆకాశాన్ని అంటుతోంది.…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు…