జగన్ టార్గెట్ అదేనా..? అందకే మార్పులా..?
ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో తిరుగులోని విజయాన్ని అందుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఏకంగా 151 స్థానాలు కైవసం చేసుకుంది.. అయితే, టార్గెట్ 2024.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. 175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పజెప్పింది. గ్రూపు తగాదాలున్న కొండేపి, అద్దంకి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండెపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికుటి అశోక్ బాబును…పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో…వరికూటి అశోక్‌బాబుకు వేమూరు బాధ్యతలు ఇచ్చింది. అద్దంకి విషయంలో జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. అద్దంకి ఇంఛార్జ్ గా ఉన్న కృష్ణ చైతన్యను పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణ చైతన్యను ఇక్కడి నుంచి తప్పించి హనిమిరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో కమ్మ సామాజిక వర్గానికి బదులు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది.
నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి సురేష్
మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. నియోజకవర్గ మార్పుపై స్పందించిన ఆయన.. నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటాం.. పార్టీలో ఎప్పుడు ఓ సైనికుడిలా పనిచేస్తాం.. మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అనే తేల్చిచెప్పారు. వచ్చే మ్యాచ్ గెలవాలంటే సీఎం వైఎస్ జగన్ కూర్పు ఎలా ఉన్నా ఆయన ఫీల్డ్ సెట్టింగ్ ప్రకారం నడుచుకుంటాం అన్నారు. కొండేపిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తాం తెలిపారు. పార్టీ స్ట్రాటజీ ప్రకారం కొండేపి నియోజకవర్గంలో గెలవాలన్న ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తాం అన్నారు ఆదిమూలపు సురేష్.. గతంలో పనిచేసిన ఇంఛార్జ్‌లను కలుపుకుని.. వారి సహాయ సహకారాలతో తీసుకుంటా.. కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉందన్నారు. జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తాం.. వచ్చే ఎన్నికల్లో కొండేపిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుటా ఎగుర వేస్తుందని ఆశిస్తున్నాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
గాజువాకలో నాటకీయ పరిణామం.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ.. రాజీనామాపై దేవన్ రెడ్డి వెనక్కి..!
గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని ప్రకటించారు ఎమ్మెల్యే నాగిరెడ్డి. కాగా, 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. ఇక, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి వయసు రీత్యా యాక్టివ్‌గా లేకపోవడంతో.. ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి గతంలోనే నియోజవర్గ బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ దేవన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేకపోవడంతో.. వరికూటి రామచంద్రావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.. దీంతో, నియోజకవర్గ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్టు ముందుగా వార్తలు వచ్చినా.. ఈ రోజు రాజీనామా చేయలేదు.. మా ప్రయాణం సీఎం వైఎస్ జగన్ వెంటే అని ప్రకటించారు.
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు షాక్, జైలు శిక్ష, జరిమానా విధింపు
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది.. వచ్చే నెల జనవర 2వ తేదీ 2023న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో.. కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. కాగా, గతంలోనూ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు.. వివిధ కేసుల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. హైకోర్టు జైలు శిక్షలు విధించిన విషయం విదితమే. ఇదే సమయంలో.. వారు హైకోర్టు ముందు హాజరై.. తమ తప్పును ఒప్పుకోవడంతో.. జైలు శిక్ష కాకుండా.. సాధాణ శిక్షలు అమలు చేసిన సందర్భాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కీర్తి చేకూరి కూడా శిక్షతో పాటు జరిమానా విధించింది.. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచిచూడాలి.
రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను 100 రోజుల్లో అమలుచేస్తాం: ఉత్తమ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ‘రూ. 500కే గ్యాస్ సిలిండర్’ కూడా ఒకటి. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను 100 రోజుల్లో అమలుచేస్తాం అని తెలిపింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నేడు పౌరసరఫరాలశాఖపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు వివరించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. గత పాలకుల వల్ల పౌరసరఫరాలశాఖలో తప్పిదాలు జరిగాయని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ. గ్యాస్ సిలిండర్ రూ. 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్‌లో రూ. 500 పెంచేది వంద రోజుల్లో అమలు చేస్తాం. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటివరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యింది. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలి. 2 కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్‌కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు.
మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తా: ఆర్మూర్ ఎమ్మెల్యే
తాను ఎవ్వరికీ భయపడను అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. తనను చంపడం ఎవరి తరం కాదని, అలాంటి పరిస్థితి వస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తానన్నారు. విదేశాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయని.. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కకటి బయటకు తీస్తానని రాకేష్ రెడ్డి చెప్పారు. బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయి. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారు. అక్రమ మైనింగ్, మాల్ అంశాల జోలికి పోవద్దని కాల్స్ చేస్తున్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తా. గత పదేళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే. సీబీఐ డైరెక్టర్‌ను కలిశాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ పంపాలని అడిగారు. త్వరలో హోం మంత్రి, సీఎంను కలుస్తా’ అని రాకేష్ రెడ్డి చెప్పారు. ‘ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కకటి బయటకు తీస్తా. నన్ను చంపడం ఎవరి తరం కాదు. అలాంటి పరిస్థితి వస్తే.. మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి నేను చస్తా. నేను ఎవ్వరికీ భయ పడను. అందరి బాగోతాలు బయటపెడుతా’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రాకేష్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు.
శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ.. నిర్వహణలోపంపై నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎంపీలు
ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది యాత్రికులు దర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా సేపు వేచి ఉండటంతో యాత్రికులు బారికేడ్లు దూకుతున్నారు. ఫలితంగా మెట్ల దగ్గర అనియంత్రిత రద్దీ ఏర్పడింది. ఆలయంలో అస్తవ్యస్తంపై మంగళవారం పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఈ స్వరం ఎత్తారు. పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేరళ నుంచి వస్తున్న చాలా మంది కాంగ్రెస్ నేతలు గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పి విజయన్‌ను చుట్టుముట్టారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ నిరసనకు కేరళ ఎంపీ రాహుల్ గాంధీ, శశిథరూర్ వంటి నేతలు గైర్హాజరయ్యారు. అంతకుముందు ఆదివారం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) దర్శన సమయాన్ని ఒక గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యాలు సరిగా లేవని, భక్తులు దర్శనం కోసం 15 నుంచి 20 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. భక్తులకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. తీర్థయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, శబరిమల ఆలయంలో దర్శన సమయాన్ని గంటపాటు పొడిగించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. దర్శన సమయాలను సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు కాకుండా మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రోజు రెండవ భాగంలో సవరించాలని బోర్డు నిర్ణయించినట్లు జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు అధికారి తెలిపారు. కొండపై ఉన్న ఆలయానికి వార్షిక 41 రోజుల మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16న ప్రారంభమైంది. భక్తులందరికీ సురక్షితమైన తీర్థయాత్రను కల్పించడానికి.. ప్రభుత్వం రద్దీని నిర్వహించడానికి క్యూ-నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
ధీరజ్ సాహు లాకర్లో ఇప్పటి వరకు డబ్బే.. ఇప్పుడు ఏకంగా బంగారు బిస్కెట్లు, వజ్రాలు
‘క్యాష్ కింగ్’గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఒడిశాలో వారికి సంబంధించిన డిస్టిలరీ కంపెనీ ఆస్తులపై కూడా ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడి బోలంగీర్‌లోని టిట్లాగఢ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన మూడు లాకర్ల నుంచి 40 బంగారు బిస్కెట్లు, వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒడిశాలోని బలంగీర్, సంబల్‌పూర్, తిట్లాగఢ్‌లలో ఉన్న ఎస్‌బీఐ మూడు శాఖల నుంచి రూ.351 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్బీఐ వార్నింగ్.. వాటిని నమ్మి మోసపోవద్దు..
రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. సర్వీస్ రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను వార్నింగ్ ఇచ్చింది. రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. నకిలీ ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
సక్సస్ ని రిపీట్ చేస్తూ ఉండు రజినీ అంటూ కమల్ స్పెషల్ ట్వీట్
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో తలైవా ట్యాగ్స్ తో హల్చల్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. అభిమానులే కాదు ధనుష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రజినీకాంత్ ని బర్త్ డే విషెష్ చెప్పడంతో సోషల్ మీడియాలో రజినీ పేరు మారుమోగుతుంది. తలైవా ఫ్యాన్స్ లో జోష్ నింపేలా బయటకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీట్. “Happy birthday to my dear friend Superstar rajinikanth. I sincerely wish you to live a happy life reaping success today and forever” అంటూ రజినీకాంత్ కి బర్త్ డే విషెష్ చెప్పాడు కమల్ హాసన్. ఈ ట్వీట్ ని మ్యూచువల్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇద్దరు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల అభిమానుల మధ్య ఇంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉండడం చాలా అరుదు. రజినీకాంత్-కమల్ హాసన్ ల ట్రూ ఫ్రెండ్షిప్ వల్లే ఇది సాధ్యం అయ్యింది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. ఒకరి సినిమాల రికార్డులు ఒకరు బ్రెల్ చేసుకుంటూ మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా, పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ హీరోస్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజినీ-కమల్ లు కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్లు కలిసిన ఫోటోలు, వీడియోలు బయటకి వస్తే చాలు అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది. అంతగా రిలేషన్షిప్ ని ఇన్నేళ్లగా చెక్కు చెదరకుండా మైంటైన్ చేస్తూనే ఉన్నారు రజినీకాంత్ కమల్ హాసన్.
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు… బ్రో ఐ డోంట్ కేర్
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్యూబ్ ని కుదిపేసింది సలార్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డులు చెల్లా చెదురు చేసి సలార్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ తో డిజిటల్ రికార్డ్స్ ని సెట్ చేసిన ప్రభాస్… ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి నుంచి సరిగా పది రోజుల్లో మాస్ హిస్టీరియా అనే పదానికి అర్ధం చూడబోతున్నారు ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సరిగ్గా చెయ్యట్లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్ని ఇండస్ట్రీల యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల కోసం ఇండియా మొత్తం తిరిగి, ఆడియన్స్ కి కలిసి సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇతర హీరోలు సినిమాల కోసం ఇంతగా ప్రమోషన్స్ చేసినా ప్రభాస్ ఫ్లాప్ సినిమా స్థాయి కలెక్షన్స్ ని కూడా కలెక్ట్ చేయలేకపోతున్నారు. కలెక్షన్స్ పక్కన పెడితే ఓపెనింగ్స్ కూడా ప్రభాస్ సినిమాల స్థాయిలో రావట్లేదు. దీన్ని బట్టి చూస్తే ఇది ప్రభాస్ సినిమా అనే పేరు వినిపిస్తే చాలు వంద కోట్ల ఓపెనింగ్ రావడం గ్యారెంటీ. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం ఇండియాలో ఉన్న హీరోలందరి కన్నా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అందుకే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ విషయంలో కంప్లీట్ సైలెంట్ గా ఉన్నట్లున్నారు. పది రోజుల్లో రిలీజ్ ఉన్నా కూడా ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు… అసలు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ప్రమోషన్స్ చెయ్యకపోయినా సలార్ సినిమా, పైగా హైప్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గబ్బర్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే డైలాగ్ ఒకటి రాసాడు “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” ఈ డైలాగ్ ఇప్పుడు ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్రమోషన్స్ ని ఐ డోంట్ కేర్ అన్నట్లు ఉన్న ప్రభాస్ ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబడితే చాలు ప్రభాస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ఫైర్ మోడ్ లో ఉన్నాయి, రీజనల్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ఓపెన్ కానున్నాయి. ప్రీ బుకింగ్స్ నుంచి సలార్ సినిమా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయనుంది.