నేటి నుంచి అంగన్‌వాడీల సమ్మె.. అన్ని కేంద్రాలు మూత..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లపై వారు మంగళవారం నుంచి సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి.. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్‌వాడీలు.. తాజాగా జిల్లా కేంద్రాల్లోనూ చేపడుతున్నారు. అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపడుతున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. న్యాయపరమైన హక్కుల కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల పోరాటంలో అర్థముందని.. అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని తెలిపింది. అంగన్వాడీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. టీచర్లకు, వర్కర్లకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తోందని విమర్శించింది. అయితే, వేతనాల పెంపు, గ్రాట్యుటీ వంటి డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు అంగన్వాడీలు..
కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ఆల్‌టైం హై రికార్డు..
రోజుకో కోడి గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతుంటారు.. అందుకే కిచెన్‌లో కోడి గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. రోజువారీ ఆహారంలో గుడ్డు.. కచ్చితంగా గుడ్లు తినడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాన్ని అస్సలు మరిచపోవద్దు. ఉడికించిన గుడ్లని తినడం మంచిది. గుడ్లలో ఎన్నో పోషకాలు, గుడ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.. గుడ్లు పోషకాలకి స్టోర్ హౌజ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1. 6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నమాట.. అయితే, కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది.. విశాఖలో ఆల్‌టైం హై రికార్డు స్థాయికి చేరింది. నిన్నటి వరకు కార్తిక మాసంతో.. నాన్‌వెజ్‌తో పాటు గుడ్లకు కూడా కొంతమంది దూరంగా ఉంటూ వచ్చారు.. అయితే, కార్తిక మాసం ముగింపు, క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్‌తో గుడ్డు ధర పైపైకి కదులుతోంది.. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది.. రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డును ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.. ఇక, టోకుగా 100 గుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది.. అంటే హోల్ సెల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.5.80 పలుకుతుండగా.. అదే రిటైల్ మార్కెట్‌కి వచ్చే సరికి సరాసరి రూ.1.20 పెంచేసి.. రూ.7కు విక్రయాలు సాగిస్తున్నారు. స్థానికంగానే కాకుండా.. పశ్చిమ బెంగాల్, నార్త్ ఇండియా నుంచి కూడా కోడి గుడ్లకు డిమాండ్ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
యువతిని వేధిస్తున్నారని వార్నింగ్.. దారుణంగా హత్య చేసిన యువకులు
తిరుపతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు ముగ్గురు యువకులు.. సుబ్బారెడ్డి నగర్‌లోని కిషోర్ ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.. హత్యచేసినా యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వెంటపడిన యువకుడికి చుక్కలు చూపించిన యువతి.. వీడియో వైరల్!
భారతదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆడవాళ్లపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఓ చోట మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాచారాలు, వేధింపులకు మహిళలు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన వెంటపడిన ఓ యువకుడికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పుదుచ్చేరి బస్ స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. నది రోడ్డుపైనే యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ వెంటపడ్డాడు. ముందుగా యువతి మాటలతో అతడిని అడ్డుకుంది. మాటలతో చెప్పిన ఫలితం లేకపోవడంతో యువకుడుని అందరూ చూస్తుండగానే చితకబాదింది. యువకుడి మర్మాంగాలపై తన్నడంతో అతడు విలవిల్లాడిపోయాడు. ఆపై యువతి అక్కడినుంచి వెళ్ళిపోయింది. యువకుడిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు యువతి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. మహిళలో స్పూర్తి నింపావంటూ పోస్టులు పెడుతున్నారు. హ్యాట్సాఫ్ అమ్మా, మంచి పని చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన డిసెంబర్ 9న మధ్యాహ్నం జరుగునట్లు తెలుస్తోంది.
నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20.. ఆట సాగేనా?
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ టాస్ పడకుండానే వర్షంలో కోట్టుకుపోగా.. ఇప్పుడు రెండో టీ20కి కూడా వానముప్పు పొంచి ఉంది. అభిమానులకు మాత్రమే కాదు రూ. కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ)కు కూడా వాతావరణ పరిస్థితులు అడ్డుగా మారాయి. దాంతో రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆట సజావుగా సాగేనా? లేదో?. గబేహాలో మంగళవారం రాత్రి 8.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. దానికి ముందు భారత జట్టు ఐదు టీ20లు మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లోనే టీమిండియా బ్యాటింగ్ స్థానాలపై ఓ అవగాహనకు రావాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వచ్చే జూన్‌లో జరిగే మెగా టోర్నీకి జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన కీలకం కానుంది. నిరుడు టీ20 ప్రపంచకప్ అనంతరం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పొట్టి ఫార్మాట్ ఆడడం లేదు. మరి వచ్చే మెగా టోర్నీలో వీరిద్దరూ ఆడతారా? లేదా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ వీరు అందుబాటులో ఉండకపోతే.. యువ ఆటగాళ్లతోనే భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. మొత్తానికి ఐపీఎల్ 2024 తర్వాతే మెగా టోర్నీ జట్టుపై ఓ అవగాహన రానుంది.
ఈ మూడు క్రెడిట్ కార్డ్‌లుంటే.. న్యూ ఇయర్ కు 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఫ్రీ
చాలా మంది డిసెంబర్‌లో సెలవులు ప్లాన్ చేసుకుంటారు. డిసెంబరు చివరి వారంలో ఆఫీసు పనికి సెలవు పెట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ సమయంలో పిల్లల క్రిస్మస్ సెలవులు కూడా వస్తాయి. సెలవులు గడపడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌గా మార్చడం ద్వారా మీరు 5-స్టార్ హోటల్ బసను ఆస్వాదించగలిగితే? ఒక్కసారి ఆలోచించండి ఎంత ఆనందంగా ఉంటుందో.. ఈ వార్తలో దాని గురించే తెలుసుకుందాం. హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్ అనేది మీరు హోటల్లో బస చేసినప్పుడు మీకు అనేక ప్రయోజనాలను అందించే మెంబర్‌షిప్ ప్రోగ్రామ్. ఇది కొత్త కస్టమర్‌లను సంపాదించడానికి, అలాగే గ్రూప్‌లోని హోటల్ ప్రాపర్టీలలో ఉండటానికి, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లను నిలుపుకోవడానికి ఉపయోగించబడుతుంది. దీంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రయోజనం పొందవచ్చు. భారతదేశంలోని ప్రసిద్ధ హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లలో మారియట్ బోన్‌వాయ్, అకార్ లైవ్ లిమిట్‌లెస్ (ALL), అకార్ ప్లస్, తాజ్ ఎపిక్యుర్, క్లబ్ ITC మొదలైనవి ఉన్నాయి.
గూగుల్ సెర్చ్ లో టాప్ సినిమాలు,షోలు ఇవే..
గూగుల్ సెర్చ్ లో 2023 సంవత్సరానికి అత్యధికంగా జనాలు వెతికిన సినిమాలు, షో ల లిస్ట్ ను తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరంలో ‘బార్బీ’ మరియు ‘Oppenheimer’ వంటి కొన్ని ప్రధాన సినిమాలు ఉన్నాయి.. అలాగే ‘ది లాస్ట్ ఆఫ్ అస్’ మరియు ‘వన్ పీస్’ వంటి టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన రెండు చిత్రాలతో సహా మూడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలోకి వచ్చాయి. అందులో ఆదిపురుష్, ది కేరళ స్టోరీ, లియో, జైలర్,టైగర్ 3 వారిసు కూడా ఉన్నాయి.. టీవీ షోస్ స్పేస్‌లో ఎక్కువగా ఇంగ్లీష్ మరియు కొరియన్ షోలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.. ఈ సంవత్సరంలో అత్యధికంగా శోధించబడిన చిత్రం బార్బీ, ఆ తర్వాతి స్థానంలో ‘ఓపెన్‌హైమర్’ నిలిచింది. ఈ సినిమాలు ఏకకాలంలో విడుదల కావడం వల్ల ఆన్‌లైన్‌లో ‘బార్బీహీన్మర్’ అనే పదం ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ లో వెతికిన మూడు చిత్రాలలో షారుఖ్ ఖాన్ రెండు చిత్రాలలో నటించాడు. జాబితాలో ‘జవాన్’ మూడవ స్థానంలో మరియు ‘పఠాన్’ 10వ స్థానంలో ఉన్నాయి.. ఈ రెండు కూడా భారతదేశంలో అత్యధికంగా వెతికిన హిట్ సినిమాలు. ‘పఠాన్’ జనవరిలో విడుదలైంది మరియు సెప్టెంబరులో ‘జవాన్’ బద్దలు కొట్టిన అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. జవాన్ వద్ద రూ. 1,148, పఠాన్ మొత్తం రూ. 1,050.. అత్యధికంగా శోధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఇతర భారతీయ చలనచిత్రం గదర్ 2’. 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథ, ఈ గదర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 691.08 కోట్లు రాబట్టింది.. ఇక ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, మార్చి 11, 2022న విడుదలైంది.. పదకొండు అకాడెమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు జాబితాలో ఏడవ ర్యాంక్‌తో సహా ఏడు గెలుచుకుంది. జాబితాలో పేర్కొన్న ఇతర సినిమాల్లో ‘సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్’, ‘జాన్ విక్: చాప్టర్ 4’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మరియు ‘క్రీడ్ III’ ఉన్నాయి..
ఇద్దరూ ఒకడే… రిలీజ్ కి ముందే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి నీల్ మావా?
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడు” అంటూ న్యూస్ వినిపించింది. మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ కొడుకు దేవా… దేవానే ఇలా ఉంటే ఇక సలార్ వస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ హైప్ పెంచారు. ఈ విషయంలో డిసెంబర్ 22న క్లారిటీ వస్తుంది అనుకుంటే రిలీజ్ కన్నా ముందే ఇద్దరూ ఒకడే అని రివీల్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాలో సలార్, దేవా వేరు వేరు కాదు ఇద్దరూ ఒకడే అంటూ ప్రశాంత్ నీల్ రివీల్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో రిలీజ్ ముందే రివీల్ చేసేసావ్ ఏంటి మావా అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ పరంగా ప్రభాస్ రెండు వెరియేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఒకటి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకొకటి ప్రెజెంట్ రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. తండ్రి కొడుకులు కూడా ఉంటారా లేక ఒక క్యారెక్టర్ తోనే ప్రభాస్ రెండు పార్ట్స్ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఒకడైన ఇద్దరైనా బాక్సాఫీస్ దాగ్గర డిసెంబర్ 22న సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టడం అయితే గ్యారెంటీ.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమల్ కలెక్షన్స్..11 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..?
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘యానిమల్ ‘ ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకోవడంతో కాసుల వర్షం కురిపిస్తుంది.. ఇక డిసెంబర్ 1న విడుదలైన ఈ సూపర్ హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ మూవీపై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ను ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ 10 వ రోజు కూడా యానిమల్ మంచి వసూళ్లను రాబట్టింది.. ఇకపోతే 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 61 కోట్లు, నాలుగో రోజు 38 కోట్లు, ఐదో రోజు 32 కోట్లు, 6వ రోజు 26 కోట్లు, 7వ రోజు 22 కోట్లు, 8వ రోజు 21 కోట్లు, 10 వ రోజు 34 కోట్లు. టోటల్ కలెక్షన్ రూ.717. 46 కోట్లు రాబట్టింది..ఈ వారంలో రూ. 1000 కోట్లు రాబడుతుందని అంచనా.. ఇది మామూలు విషయం కాదు..