ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డిసెంబర్ 10న జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను జట్టులోకి తీసుకోలేదు. అంతేకాకుండా.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్ లో లేడు.
Resignation: టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్.సత్యనారాయణ రాజీనామా
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ – యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్- మాథ్యూ బ్రెట్జ్కే, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జెన్సన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీ, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షామ్‌సి.