ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ (67), శివం దూబె (28), డారిల్ మిచెల్ (25), రచిన్ రవీంద్ర (15) పరుగులు చేశారు. చివరలో ధోనీ వచ్చి అభిమానులకు సంతోషం అందించారు. చెన్నై గెలుపుతో మూడో విజయాన్ని నమోదు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చెన్నై ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. హోంగ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. మరో విజయంపై కన్నేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియా 2024-25 సీజన్ కోసం మహిళల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ను ప్రకటించింది. సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రెండు సంవత్సరాల తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్కి తిరిగి వచ్చింది. గత కొన్ని సిరీస్లలో మోలినెక్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కూడా, ఈ స్టార్ ఆల్ రౌండర్ అద్భుతమైన ఆట ఆడి ప్రశంసలు అందుకుంది.
ఐపీఎల్ 2024లో ఇండియా క్రికెటర్లదే హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరగ్గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 316 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (191), రియాన్ పరాగ్ (185), శుభ్ మన్ గిల్ (183), సంజూ శాంసన్ (178)పరుగులతో టాప్ లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (31) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్ మాన్ గిల్ (19), విలియమ్సన్ (1), శరత్ (2), విజయ్ శంకర్ (17), నాల్కండే (12), చివరలో రాహుల్…