ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు మిస్టర్ 360. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడేలో స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. అటు.. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ఈ…
నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో.. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మిగతా మ్యాచ్ లు ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. జట్టు విజయం కోసం పరితపిస్తుండగా.. ఓ యువ ఆటగాడిని రంగంలోకి దింపుతుంది. విష్ణు వినోద్ స్థానంలో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయం సాధిచింది. ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. ఆఖరి బంతికి టార్గెట్ ను చేధించింది. చివరలో రషీద్ ఖాన్ (24), రాహుల్ తెవాటియా (22) రాణించడంతో విక్టరీ సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68) చెలరేగి ఆడటంతో.. రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.