ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ (67), శివం దూబె (28), డారిల్ మిచెల్ (25), రచిన్ రవీంద్ర (15) పరుగులు చేశారు. చివరలో ధోనీ వచ్చి అభిమానులకు సంతోషం అందించారు. చెన్నై గెలుపుతో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు.. కేకేఆర్ బౌలింగ్ లో వైభవ్ అరోరా 2 పడగొట్టగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.
Read Also: Rajasthan: ఆస్పత్రి టాయిలెట్లో శవమై కనిపించిన కాంట్రాక్ట్ ఉద్యోగి.. కారణమేంటంటే..?
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేశారు. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా (34) పరుగులు చేశాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. నరైన్ (27) పరుగులు చేశాడు. ఆ తర్వాత రఘువంశీ (24), వెంకటేశ్ అయ్యర్ (3), రమన్ దీప్ సింగ్ (13), రింకూ సింగ్ (9), రస్సెల్ (10), అనుకుల్ రాయ్ (3) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా చెరో వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ రహమన్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.
Read Also: Robbery : మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. వరుడికి షాక్ ఇచ్చిన పోలీసులు