సన్రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గాయాలు వదలడం లేదు. ఇప్పటికే జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు. తాజాగా.. మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ముంబైతో జరిగే మ్యాచ్కు ఆడటం కష్టమేనని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. అంతేకాకుండా.. అతను కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేదు. కాగా.. ఈసీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన మార్ష్.. 71…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో రాజస్థాన్కి ఇది నాలుగో మ్యాచ్ కాగా.. బెంగళూరుకు ఐదో మ్యాచ్. కాగా.. ఈ సీజన్లో మూడింటిలో మూడు గెలిచి రాజస్థాన్ మంచి ఫామ్లో ఉంది. రాజస్థాన్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక.. బెంగళూరు ఆడిన 4 మ్యాచ్ల్లో 3…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్ లో గెలిచి సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు…
ఐపీఎల్ 2024లో భాగంగా... సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్ల దూకుడును ఆపారు. ముఖ్యంగా.. శివం దూబే క్రీజులో ఉన్నంతసేపు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఒకానొక సమయంలో స్కోరు 200+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఆర్ హెచ్ కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకు సపోర్ట్ గా మారింది.