ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగినన మ్యాచ్ లో కోల్‌కతా ఘన విజయం విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 26 బంతుల్లో ఉండగానే ముగించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (89) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38) కూడా చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. కోల్‌కతా ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో నికోలస్ పూరన్ అత్యధికంగా (45) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠపోరులో రాజస్థాన్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ పంజాబ్ వైపు ఉన్నప్పటికీ.. హెట్మేయర్ చెలరేగడంతో రాజస్థా్న్ కు విజయం వరించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థా్న్.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బౌలర్ల ముందు పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. చివరలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ అత్యధిక స్కోరు చేశాడు. కేవలం 16 బంతుల్లో 31 పరుగులు చేసి.. స్కోరును పెంచాడు.
భారత క్రికెట్ జట్టులో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పవచ్చు. అతని కెప్టెన్సీలో భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిపెట్టాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా.. మొదటగా టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. టీమిండియా ఐసీసీ టైటిల్స్ ను గెలిచి 28 ఏళ్లు అవుతుంది. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ అందరి మదిలో గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఐసీసీ…
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా.. కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్‌ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చంఢీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాడు. పంజాబ్ తో జరిగే మ్యాచ్‌లో చాహల్ 3 వికెట్లు పడగొడితే ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.