ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడేలో స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. అటు.. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ఈ క్రమంలో.. నాలుగు మ్యాచ్లు ఓడిపోయి 9వ స్థానంలో కొనసాగుతుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరుజట్లు తపిస్తున్నాయి. అయితే.. ముంబై ఇండియన్స్కు హోంగ్రౌండ్ కాగా.. వారికే ఎక్కువగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, నబీ, కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, పాటీదార్, మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), లోమ్రోర్, టోప్లీ, వైశాఖ్, సిరాజ్, ఆకాశ్ దీప్.