ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో తొలి మ్యాచ్ లో ఆడిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (55) పరుగులతో విజయానికి పునాదులు వేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (41) కూడా పరుగులతో రాణించాడు. ఓపెనర్లలో పృథ్వీ షా (32), డేవిడ్ వార్నర్ (8), స్టబ్స్ (15*), హోప్ (11*) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: అత్యధిక సగటు లైంగిక భాగస్వాములు ఉన్న 10 దేశాలు ఇవే..(ws)
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో అత్యధికంగా ఆయుష్ బదోని (55) పరుగులు చేసి జట్టుకు కీలక రన్స్ చేసి సాధించిపెట్టాడు. 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 4 ఫోర్లు ఉన్నాయి. క్వింటాన్ డికాక్ (19), కేఎల్ రాహుల్ (39), పడిక్కల్ (3), స్టోయినీస్ (8), పూరన్ డకౌట్ అయ్యాడు. దీపక్ హుడా (10), కృనాల్ పాండ్యా (3), అర్షద్ ఖాన్ (20) పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 2.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు. కాగా.. ఢిల్లీ ఈ విజయంతో రెండో గెలుపును నమోదు చేసుకుంది.
Read Also: Sabdham: వామ్మో.. వణికిస్తున్న శబ్దం టీజర్