ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి.