ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ 10 వికెట్ల నష్టానికి142 రన్లు చేసింది. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచింది. గుజరాత్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు.
నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు.
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింకు దిగిన కోహ్లీ 18 రన్లు చేసి.. హర్షిత్ రాణా చేతిలో ఔటయ్యాడు.
చెలరేగుతున్న బెంగళూరు బౌలర్లు. బోలింగ్ సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు వరుసగా ఓటముల పాలవుతోంది. స్టార్ బౌలర్గా పేరు తెచ్చుకున్న సిరాజ్ తన పేరును నిలబెట్టుకోలేక పోయాడు. కాని కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ఈ సీజన్లో మొట్టమొదట అయిదు వికెట్లు తీసుకుంది.
ఐపీఎల్ మ్యాచులంటేనే చివరిబంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. అనూహ్య విజయాలు, ఓటముల్లో మాత్రం బెట్టింగ్ల కోసం ఫిక్సింగ్ చేశారనే టాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సహజంగానే వినిపిస్తుంది. ఈ సీజన్లోనూ ఇలాంటి మ్యాచులు ఎక్కువే ఉన్నాయి. దీంతో కొన్ని మ్యాచుల్లో ప్లేయర్లు ఫిక్సింగ్కి పాల్పడి ఉంటారన్న అనుమానాలున్నాయి. ముంబై, జైపూర్ స్టేడియాల్లో బుకీలను గుర్తించి పోలీసులకు అప్పగించారన్న సమాచారంతో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు బలం చేకూరుతోంది.