Panjab VS Gujarat: నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు. మరో ఓ పెనరైన జానీ బెయిర్ స్టో కూడా ఫాంలో లేని కారణంగా మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు. వీరిద్దరూ లేకపోవడంతో ఏ మేరకు టీంపై ప్రభావం పడుతుందో వేచి చూడాలి.
READ MORE: Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తాం..
పంజాబ్ జట్టు..
రిలీ రోసావ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్యామ్ కరణ్(కెప్టెన్), జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్ దీప్ సింగ్.
గుజరాత్ టైటాన్స..
వృద్ధిమాన్ సాహా, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, సాయి కిషోర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.
ఇదీ పిచ్ పరిస్థితి..
ముల్లాన్ పూర్ మైదానంలో సగటు పరుగులు 187. ప్రస్తుత మ్యాచ్ లలో దాదాపు టీంలు అన్ని రెండు వందలకు పైబడి పరుగులు తీస్తున్నాయి. ఈ మైదానం బ్యాటింగ్ కు కొంత అనుకూలంగా ఉంది. ప్లేసర్లకు ఈ పిచ్ కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్లేసర్లు ఇక్కడ 47 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లకు అంతగా కలిసి రాలేదు. పవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాప్ ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు తీసింది. మోహిత్ తన ఓవర్లో ఫాంలో ఉన్న ప్రభ్ సిమ్రాన్(35)ను ఔట్ చేశాడు. రెండో బాల్ ను సిక్స్ వైపు మళ్లించిన సిమ్రాన్.. తరువాత బాల్ సాహా చేతికి చిక్కింది.