Kolkata Vs Bengaluru: బెంగళూరు బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సీజన్ లో బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు వరుసగా ఓటముల పాలైంది. స్టార్ బౌలర్గా పేరు తెచ్చుకున్న సిరాజ్ తన పేరును నిలబెట్టుకోలేక పోయాడు. కాని కోల్ కతాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఈ సీజన్లో బెంగళూరు మొట్టమొదట అయిదు వికెట్లు తీసుకుంది. సునిల్ నరైన్, ఫిల్ స్టాల్, రింకు సింగ్ వంటి స్టార్ బ్యాటర్లను నిలువరించగలిగారు. కాని స్కోర్ మాత్రం పెరుగుతూనే ఉంది. 13.1 ఓవర్ల తరువాత 5 వికెట్లు కోల్పోయిన కోల్ కతా 137 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ బెంగళూరు ఎలాగైనా గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
READ MORE: బెంగళూరు VS కోల్ కతా మధ్య పోరు.. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉందా..
రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీం కు అతి పెద్ద సమస్య సరైన బోలింగ్ లేకపోవడమే. స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ ఈ సీజన్లో కోహ్లీ తప్ప ఎవ్వరూ రాణించలేక పోతున్నారు. కోహ్లీ తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రపంచ కప్ లో చెలరేగిన మ్యాక్స్ వెల్ ఈ సీజన్లో చతికిల పడ్డాడు. మూడు మ్యాచ్లలో సున్నా పరుగులు సాధించి.. టీం, అభిమానులను నిరాశ పరిచాడు. ఈ ఆట తీసురు సరిగ్గా లేని కారణం మానసిక ఒత్తిడికి గురై ఈ సీజన్లో తప్పుకున్నాడు. మ్యాచ్ ప్రారంభంలో విరాట్, చివరి క్షణంలో దినేశ్ కార్తిక్ చెలరేగుతూ.. బెంగళూరు టీం కి ప్రాణం పోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు ఫాంలో ఉన్నారు. వీరికి బౌలర్లు తోడైతే ఈ మ్యాచ్ ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంటుంది.