ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్ లో చతికిలపడింది. 35 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 6 వరుస ఓటముల తర్వాత బెంగళూరు విక్టరీని నమోదు చేసింది. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ (1) పరుగు చేసి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ (31) పరుగులు చేసి క్రీజులో ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మార్క్రమ్ (7) పరుగులు చేశాడు. ఫుల్ టాస్ బాల్ కు ఔటయ్యాడు. తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి (13), క్లాసెన్ (7) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు.
CM Revanth Reddy : కారు ఇక తుకానికి పోవాల్సిందే..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ (40) చివరి వరకు ఉండి ఒంటరిపోరాటం చేశాడు. అబ్దుల్ సమద్ (10), చివర్లో ప్యాట్ కమిన్స్ (31) పరుగులు చేసి మ్యాచ్ పైనే ఆశలు తీసుకొచ్చాడు. భువనేశ్వర్ కుమార్ (13), ఉనద్కత్ (8) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో మొదట్లోనే విల్ జాక్స్ కీలకమైన ట్రావిస్ హెడ్ వికెట్ తీసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన స్వప్నిల్ సింగ్.. మరింత దెబ్బతీశాడు. కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. కర్ణ్ శర్మ కూడా 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెమెరాన్ గ్రీన్ 2 వికెట్లు, యష్ దయాల్ ఒక వికెట్ తీశారు.
Vemulawada : వేములవాడ రాజన్న ఆలయంలో 12 మంది సిబ్బందిపై చర్యలు
కాగా.. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. డుప్లెసిస్ (25) పరుగులు చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (6) పరుగులు చేసి తొందర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్ (50) అర్థ సెంచరీతో రాణించాడు. చివరల్లో కెమెరాన్ గ్రీన్ (37*) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లోమ్రోర్ (7), దినేష్ కార్తీక్ (11), స్వప్నిల్ సింగ్ (12) పరుగులు చేయడంతో.. ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలింగ్ లో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత నటరాజన్ 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు.