ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత అద్బుత విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌలర్లు అదరగొట్టడంతో గుజరాత్ జెయింట్స్ ని 105 పరుగులకి కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈటార్గెట్ ని 7.1 ఓవర్లలోనే ఊది పక్కన పడేసింది. యంగ్ సెన్సేషనల్ షెఫాలి వర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసి బౌండరీల వర్షం కురిపించింది. తొలి ఓవర్ లో 4 పరుగులే రాగా తునుజా కన్వర్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు రాబట్టిన షెఫాలి వర్మ, కిమ్ గార్త్ వేసిన మూడో ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టేసింది. ఆప్ లీగ్ గార్నర్ వేసిన నాలుగో ఓవర్ లో వరుసగా 4,4,6 బాదిన షెఫాలీ వర్మ ఆ తర్వాత బంతికి సింగిల్ తీయగా చివరి రెండు బంతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ 2 ఫోర్లు బాదింది. దీంతో ఆ ఓవర్ లో 23 పరుగులు వచ్చేశాయి. మన్షీ జోసి వేసిన ఓవర్ లో 2 ఫోర్లు బాది షెఫాలీ వర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంది.
Also Read : Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ
ఆ తర్వితి ఓవర్ల ో షెఫాలీ వరుసగా 2 సిక్లర్సు బాదడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 87 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్ చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీ పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్.. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా షెఫాలీ వర్మ జోరు తగ్గించలేదు. 7వ ఓవర్లో 4,6,4 బాదిన షెఫాలీ వర్మ బాదుడికి 7 ఓవర్లలో 103 పరుగుల స్కోర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ చేసింది. మెగ్ లానింగ్ 8వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాది మ్యాచ్ ని ముగించింది. షెఫాలీ వర్మ 28 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్లతో 76 పరుగులు చేయగా మెగ్ లానింగ్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 105 పరుగుల స్వల్ప స్కోర్ చేయగలిగింది.
Also Read : Yuvagalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్
ఇన్నింగ్స్ రెండో బంతికే గుజరాత్ జెయింట్స్ సబ్బినేని మేఘన వికెట్ కోల్పోయింది. 2 బంతులాడిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘనని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మారిజానే కాప్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతి ఓవర్ లో వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు పడగొట్టింది. మారిజానే కాప్.. లౌరా వాల్వర్డ్, అప్ లీగ్ గార్డ్ నర్ వరుస బంతుల్లో అవుట్ కావడంతో 9 పరుగులకే గుజరాత్ జెయింట్స్ 3 వికెట్లు కోల్పోయింది. 14 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ కూడా మారిజానే కాప్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. ఆ తర్వాత 10 బంతుల్లో 2 పరుగులు చేసిన సుష్మ వర్మను క్లీన్ బౌల్డ్ చేసిన మారిజానే..మొత్తం ఐదు వికెట్లు తీసుకుంది. 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గుజరాత్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 25 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన జార్జియా వరెహం, రాధా యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. తనుజా కన్వర్ 19 బంతుల్లో ఓ ఫోర్ తో13 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్ లో అవుట్ కాగా, కెప్టెన్ స్నేహ్ రాణా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 3 బంతుల్లో 2 పరుగులు చేసినా స్నేహ్ రాణా, శిఖా పాండే బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి, ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది. కిమ్ గార్త్ 37 బంతుల్లో 3ఫోర్లతో 32 పరుగులు చేయగా మన్షీ జోషి 5 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మారిజానే కాప్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుంది. శిఖా పాండేకి 3 వికెట్లు.. రాధా యాదవ్ ఒక్క వికెట్ తీసుకుంది.
Also Read : Fire Accident : మొగుడు పెళ్లాన్ని విడదీద్దామని వచ్చారు.. మంటల్లో కాలిపోయారు