భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ లోయర్ బ్యాక్ లో నొప్పి రావడంతో అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ స్కానింగ్ కి పంపించారు. సాధారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు.. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో రవీంద్ర జడేజా బ్యాంటింగ్ కి వచ్చాడు. రవీంద్ర జడేజా అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వస్తాడనుకుంటే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు.
Also Read : MLC Eelections: ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
అయితే బీసీసీఐ మెడికల్ టీమ్ మాత్రం ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో కంకూషన్ సబ్ స్టిట్యూట్ గా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్ గాయపడితే ఆ విషయాన్ని రిఫరీకి తెలియచేసి, కంకూషన్ సబ్ స్టిట్యూట్ ని ఆడేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చేందుకు అవకాశం ఉండదు.
Also Read : Solar Car : పెట్రోల్, డీజిల్ ఎంత పెరిగినా ఫర్వాలేదు.. ఈ కారు కొనుక్కొంటే చాలు
అయితే ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 289 పరుగులకు 3 వికెట్లను ఇండియన్ టీమ్ కోల్పోయింది. అయితే ఫస్ట్ సెషన్ లో ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా మర్ఫీ బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో జడేజా స్థానంలో బ్యాటింగ్ కు వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ ( 26 బంతులు 10 పరుగులు ఒక సిక్స్ ) వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 179 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ప్రసెంట్ ఇండియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా లక్ష్యఛేధనకు మరో 156 పరుగులు చేయాల్సి ఉంది.