మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామానికి విరాట్ కోహ్లీ బ్రేక్ ఇచ్చి.. టెస్టుల్లో సెంచరీ బాదేశాడు. 424 నెలలుగా టెస్టుల్లో 50+ పరుగులు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సూపర్ సెంచరీ చేశాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగుల పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ 28వ సెంచరీ, 75వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు.
Also Read : Ileana Ban: అసలే అవకాశాలు లేవు.. ఇంకా ఎందుకురా పాపను ఏడిపిస్తారు
ఓవర్ నైట్ స్కోర్ 289/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 84 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్ తో 28 పరుగులు చేసిన జడేజాను టాడ్ మర్ఫీ బౌలింగ్ లో షాట్ ఆడేందుకు ట్రై చేసి ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అయితే శ్రీకర్ భరత్ తో కలిసి ఐదో వికెట్ కి 182 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన శ్రీకర్ భరత్, కామెరూన్ వేసిన ఓవర్ లోరెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 21 పరుగులు రాబట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఒక ఓవర్ లో ఇదే అత్యధిక స్కోర్.
Also Read : Swimming Pool : లేడీస్ టాప్ లేకుండా స్విమ్ చేయొచ్చు.. అనుమతిచ్చిన ప్రభుత్వం
మొదటి ఐదు వికెట్ల్కు కూడా 50+ భాగస్వామ్యాలు నమోదు చేయడం ఇండియాకి ఇది మూడొసారి. ఇంతకు ముందు 1993లో ముంబైలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ పై ఈ ఫీట్ ను భారత జట్టు సాధించింది. 2007లో మీర్ పూర్ టెస్టులో బంగ్లాదేశ్ పై మరోసారి ఫీట్ సాధించింది.. టీమిండియా.. ఆస్ట్రేలియాపై మొదటిసారి ఈ రికార్డ్ కొట్టింది. విరాట్ కోహ్లీ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు శ్రీకర్ భరత్ అవుట్ అయ్యాడు. 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, కేరీర్ బెస్ట్ స్కోర్ నమోదు చేసి నాథన్ లియాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
Also Read : Mumbai: పోలాండ్ దేశీయురాలిపై అత్యాచారం.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సహోద్యోగి
భారత్ లో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్ గా నాథన్ లియాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇండియాలో 55 వికెట్లు తీసిన నాథన్ లియాన్, 54 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ మాజీ బౌలర్ డెరిక్ అండర్ వుడ్ రికార్డును అధిగమించేశాడు. నాథన్ లియాన్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ ఐదు ఇన్నింగ్స్ ల్లో నాలుగోసారి అవుట్ అయ్యాడు.