CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
- మోదీపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
- NEET బాధితులకు న్యాయం డిమాండ్
- యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు
- వయోపరిమితి తగ్గించాలని తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ’56 అంగుళాల ఛాతీ’ మళ్లీ యువశక్తి ముందు లొంగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసన దెబ్బకు తలవంచక తప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు సుదీర్ఘ పోరాటంతో రైతులు నల్ల చట్టాలను రద్దు చేయిస్తే, నేడు విద్యార్థుల ఆగ్రహంతో కేంద్ర విద్యాశాఖే విఫలమైందని విమర్శించారు. నీట్ (NEET) వివాదంలో నష్టపోయిన బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి జోడిగా ఇకపై ‘జై యువా’ నినాదం బలంగా వినిపిస్తుందని, ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు నేటి యువత ఎంతమాత్రం భయపడదని స్పష్టం చేశారు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
యువతకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వయోపరిమితిని తగ్గించాలని కోరుతూ రాబోయే ఆగస్టు నెల ఉభయ సభల సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక తీర్మానం చేస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కనీస వయస్సును 21 ఏళ్లకు, అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థుల వయస్సును 25 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం రాబోయే రోజుల్లో తీసుకరాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటుగా ఈ పోటీ వయోపరిమితి తగ్గింపు బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!