గతంలో టీమిండియా ఫాంలో లేక కొన్ని సులభమైన మ్యాచ్ లు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో కెప్టెన్ మార్పుపై తీవ్ర చర్చలు జరిగాయి. అప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా బాధ్యతలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ లో అద్భుత రీతిలో ఆడుతోంది. ఈ క్రమంలో.. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.
Read Also: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకునే అంశంపై క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర విషయాలను తెలిపాడు. నాడు టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు, సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రోహిత్ శర్మ వెనుకంజ వేశాడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడటం అనేది ఒత్తిడితో కూడుకున్న విషయం అని, దాంతో కెప్టెన్సీకి న్యాయం చేయలేనని అతడు భావించాడని గంగూలీ చెప్పాడు.
Read Also: Supreme Court: ‘నిప్పుతో చెలగాటమాడుతున్నారు’.. పంజాబ్, తమిళనాడు గవర్నర్లకు సుప్రీం వార్నింగ్.
ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మతో సూటిగా చెప్పానని గంగూలీ తెలిపాడు. బోర్డు ప్రతిపాదనకు నువ్వు సరే అనాల్సిందే… లేదంటే టీమిండియా కెప్టెన్ గా నీ పేరు నేనే ప్రకటిస్తాను. నా సంతోషం కొసమే రోహిత్ శర్మ కెప్టెన్సీని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వం ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తున్నారు. వరల్డ్ కప్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు… అందుకు టీమిండియా సాధించిన విజయాలే నిదర్శనం” అని గంగూలీ పేర్కొన్నాడు.