AUS vs BAN: వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్స్ లు, 17 ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్మిత్ 63, వార్నర్ 53 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ కు చేరింది. 16న సెకండ్ సెమీస్ లో సౌతాఫ్రికా తో ఆసీస్ తలపడనుంది.
Read Also: iPhone 14 Offers: ఐఫోన్ 14 తక్కువ ధరకే లభ్యం..! దీపావళి ఆఫర్
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అత్యధికంగా హృదోయ్ 74 పరుగులు చేశాడు. ఓపెనర్లు తంజీద్ హసన్ 36, లిటన్ దాస్ 36, శాంతో 45, మహ్మదుల్లా 32, ముష్ఫికర్ రహీం 21, మెహిదీ హసన్ మిరాజ్ 29 పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలర్లలో అబాట్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది.
Read Also: PM Modi: మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ