ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
ICC Champions Trophy: లాహోర్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై 362/6 పరుగుల భారీ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. నేడు (2025 మార్చి 5)న జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెన్సేషన్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (49*) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు అత్యధిక స్కోరును…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.
కరాచీలో బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 అర్ధ సెంచరీలు సాధించిన రెండవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. బాబర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2015 మే 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 29 హాఫ్ సెంచరీలు, 127 వన్డేల్లో 35 హాఫ్ సెంచరీలు, 128 టీ20ల్లో 36 హాఫ్ సెంచరీలు సాధించాడు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్…
దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో 150 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది.