ఐపీఎల్ 2025లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే రెండో గెలుపుపై ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా.. గత సీజన్‌లో చెన్నైను ఓడించి ప్లేఆఫ్‌కు చేరుకున్న బెంగళూరు.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో సీఎస్కే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Read Also: Shine Tom Chako : మలయాళ బాలయ్య భలే సెట్ అయ్యాడే!
కోహ్లీ, ధోనీపై అభిమానుల దృష్టి:
ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ధోనీపై ఫ్యాన్స్ ఫోకస్ ఉండనుంది. ఐపీఎల్‌లో వీరిద్దరికి ఉన్న ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1053 పరుగులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేస్తే.. అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతానికి ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. అతను 1057 పరుగులు చేశాడు.
కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ పై 32 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 37.60 సగటుతో 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడున్న ఫామ్ చూస్తే.. కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అలాంటి ఫామ్ కొనసాగితే సీఎస్కేపై సరికొత్త రికార్డు సాధిస్తాడు.
అయితే.. గత 16 సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారికూడా చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించలేకపోయింది. ఈసారి విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ కోరికను తీరుస్తాడా..? లేదా మళ్లీ చెన్నై వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా..? అనేది చూడాల్సి ఉంది.