2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నిరాశపరిచింది. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి ప్రధాన కారణం పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ విఫలమవడం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 320 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 321 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 260 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇతర కీలక బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. మరోవైపు.. బాబర్ ఆజం (64) హాఫ్ సెంచరీ చేసినా.. జట్టు విజయంలో ఫలితం లేకుండా పోయింది.
Read Also: Kingdom; చరణ్ రిజెక్ట్ చేశాకే.. విజయ్ వద్దకు చేరిందా..?
కాగా.. కరాచీలో బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 అర్ధ సెంచరీలు సాధించిన రెండవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. బాబర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2015 మే 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 29 హాఫ్ సెంచరీలు, 127 వన్డేల్లో 35 హాఫ్ సెంచరీలు, 128 టీ20ల్లో 36 హాఫ్ సెంచరీలు సాధించాడు. బాబర్ కంటే ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఉన్నారు. 16 ఏళ్ల కెరీర్‌లో 120 టెస్టులు 46 అర్ధ సెంచరీలు, 378 వన్డేల్లో 83 అర్ధ సెంచరీలు సాధించాడు.
Read Also: Madhubala : మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన నాటి హీరోయిన్ మధుబాల
పాకిస్తాన్ తరపున అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్:
ఇంజమామ్-ఉల్-హక్: 129
బాబర్ అజామ్: 100
మొహమ్మద్ యూసుఫ్: 95
జావేద్ మియాందాద్: 93
మిస్బా-ఉల్-హక్: 84
యూనిస్ ఖాన్: 83
సలీం మాలిక్: 76
సయీద్ అన్వర్: 68
మొహమ్మద్ హఫీజ్: 64
షోయబ్ మాలిక్: 61