Danish Kaneria comments on virat kohli: పేలవ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. జింబాబ్వేలో జరిగే వన్డే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేస్తే అతడు గాడిలో పడే అవకాశాలు ఉండేవని కనేరియా అభిప్రాయపడ్డాడు. కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు. పరిస్థితులను గమనిస్తుంటే ఆసియా కప్‌కు కూడా కోహ్లీని…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్‌లో భాగంగా మహిళ క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఆలస్యమవుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. వరుణుడు శాంతించాక…
Team India For Zimbabwe Tour: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే వెళ్లే భారత జట్టును శనివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఫామ్‌తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపిక చేస్తారని గతంలో జరిగిన ప్రచారంలో నిజం…
Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…
IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన…
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు…
Century in 100th ODI Match: ప్రతి ఆటగాడు ప్రతి మ్యాచులో సెంచరీ చేయాలని భావిస్తాడు. వందో మ్యాచులో సెంచరీ చేస్తే ఆ మజానే వేరు. అంతర్జాతీయ వన్డేలలో 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో క్లిక్ చేయండి.
Team India Record: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్‌ల్లో గెలిచిన పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ జట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. తాజాగా వెస్టిండీస్‌పై వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకుని టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాకిస్థాన్ రెండో…
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో అద్భుత రీతిలో విజయం సాధించింది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన టీమిండియాను స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు…
Asia Cup 2022 promo: ఆసియా కప్ 2022 టోర్నీ కోసం సమయం ఆసన్నమైంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యూఏఈకి మార్చారు. దీంతో యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో డిజైన్ చేశారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఇదివరకే…