IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో నేడు టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా కేవలం మూడు పరుగుల తేడాతోనే భారత్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆదివారం సమష్టిగా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. అటు తొలి వన్డేలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని చేజార్చి చింతిస్తున్న వెస్టిండీస్ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో…
bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్‌లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ…
ravi shastri comments on test cricket: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో టీ20 ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు పెరిగిపోతున్నాయి. దీంతో టెస్ట్ క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ నాణ్యత పెంచడానికి జట్ల సంఖ్యను ఐసీసీ తగ్గించాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఆరు జట్లు మాత్రమే ఉండాలన్నాడు. టెస్టు క్రికెట్ నాణ్యత కోల్పోతే క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందని…
Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్‌ల మీద సిరీస్‌లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్‌కు…
ICC Latest ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే ఆటగాళ్లకు చోటు దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 790 పాయింట్లు ఉన్నాయి. అటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఖాతాలో 786 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.…
Sunil Gavaskar on Virat Kohli’s Form: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌తో సతమతం అవుతున్నాడు. గత రెండున్నరేళ్లుగా అతడి నుంచి సెంచరీ జాలువారలేదు. దీంతో కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆటగాడు జట్టు నుంచి కోహ్లీని తప్పించాలని డిమాండ్ చేశాడు. తాజాగా కోహ్లీ ఫామ్ అంశంపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 20 నిమిషాల పాటు కోహ్లీతో…
ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ జోరు చూపించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టిన టీమిండియా 109 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. పాకిస్థాన్ ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ 128 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోల్పోయినా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అటు 101 పాయింట్లతో ఆస్ట్రేలియా…
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి…