Sean Abbott: ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు నిలకడలేమిని ప్రదర్శిస్తోంది. జింబాబ్వే చేతిలో వన్డేలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గొప్ప ప్రదర్శనే చేసింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 195 పరుగులు మాత్రమే చేయగా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ బౌలర్ తన కెరీర్‌లోనే గొప్ప గణాంకాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన సీన్ అబాట్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఏకంగా నాలుగు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అంతేకాకుండా రెండు వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Also: Ravindra Jadeja: జడేజా గాయం వెనుక ఉన్న మిస్టరీ అదేనా? అంత నిర్లక్ష్యమా?
దీంతో సీన్ అబాట్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఎకానమీ 0.20ను నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో అతి తక్కువ ఎకానమీ ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన సీన్ అబాట్ 105 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 8 టీ20లు ఆడి 17 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు ఆడి కేవలం 195 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు 33 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆడం జంపా 5 వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.