ICC Rankings: నంబర్‌వన్‌గా పాకిస్థాన్ వికెట్ కీపర్.. నాలుగో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ ఆటగాడిగా అవతరించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్థానాన్ని రిజ్వాన్ ఆక్రమించాడు. దీంతో బాబర్ ఆజమ్ రెండో స్థానానికి పడిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 815 రేటింగ్ పాయింట్లు ఉండగా బాబర్ ఆజమ్ ఖాతాలో 794 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ 96 సగటుతో 192 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?
Also Read
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
గ్రూప్ దశలో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన రిజ్వాన్.. సూపర్-4లో టీమిండియాపై 71 పరుగులు చేసి పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మహ్మద్ నవాజ్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడికి దక్కింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (775 పాయింట్లు) రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ (792) ఉన్నాడు. రోహిత్ శర్మ 14వ ర్యాంకులో, విరాట్ కోహ్లీ 29వ ర్యాంకులో కొనసాగుతున్నారు. అటు టీమిండియాతో మ్యాచ్‌లో రాణించిన శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు.

తాజావార్తలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!