New Zealand: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (36) బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని గ్రాండ్‌హోమ్ చెప్పాడు. వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్టమవుతుందని.. గాయాలు వేధిస్తున్నాయని అందువల్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. జింబాబ్వేలో పుట్టిన గ్రాండ్ హోమ్ 2004లో అండర్-19 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే తరఫున ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు మకాం మార్చి…
Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది.…
Team India: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 36 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 30 మ్యాచ్‌లను భారత్ గెలుచుకుంది. కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ విన్నింగ్…
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ రిటైర్ అయ్యాక ఫినిషర్ పాత్రను పోషించేవాళ్లు కరువయ్యారు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు గొప్ప ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఫినిషర్‌కు ఉండాల్సిన లక్షణాలేంటో ధోనీ తన ప్రదర్శనల ద్వారా చూపించాడు. అయితే కొన్నాళ్లు ధోనీ స్థానాన్ని రీప్లేస్ చేసేలా హార్దిక్ పాండ్యా ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ లేమి, ఫామ్ కోల్పోవడంతో అతడు జట్టులోనే స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర…
Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు.…
Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, భువనేశ్వర్ బౌలింగ్, విరాట్ కోహ్లీ విలువైన పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆసియాకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ…
IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. 15 ఓవర్లో హార్దిక్ పాండ్యా…
Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు…