ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన సూర్యకుమార్ ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఆసియా కప్‌లో విఫలమైన బాబర్ ఆజమ్ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. సెంచరీ చేసినా తన రెండో స్థానాన్ని కోల్పోయాడు. పాకిస్థాన్ ఆటగాడు రిజ్వాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐదో స్థానానికి ఎగబాకాడు.
Read Also:Nandamuri Balakrishna: బాలయ్యపై కేసు పెట్టిన హిజ్రాలు.. ?
బౌలింగ్ ర్యాంకుల జాబితాలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇప్పుడు 18వ స్థానానికి చేరుకున్నాడు. ఆడం జంపా 6వ స్థానానికి చేరుకోగా పేలవ ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ పదో స్థానానికి దిగజారిపోయాడు. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. షాంసీ (దక్షిణాఫ్రికా), రషీద్ (ఇంగ్లండ్) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ కూడా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.