Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్లో 50 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన…
Mumbai Indians: ఈ ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే ఐపీఎల్ సీజన్లో కొత్త కోచ్ రానున్నాడు. ఈ మేరకు ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ నియమించింది. ఐపీఎల్ 2023 నుంచి తమ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా బౌచర్ కీలక ఆటగాడిగా పేరు పొందాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికాలో…
Robin Uthappa: టీమిండియాకు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇండియా, కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఉతప్ప భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు…
Australia: త్వరలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినీస్ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో, మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు…
ICC Rankings: ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు తమ హవా కొనసాగించారు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ క్రికెటర్స్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. అటు కింగ్ కోహ్లీ 15వ స్థానానికి…
KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్ఫెక్ట్ పొజిషన్…
Virat Kohli: క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అయితే గత కొంతకాలంగా సెంచరీలకు దూరంగా ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్లో 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలోనూ కోహ్లీ క్రేజ్ మరింత పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్లో ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీ 50 మిలియన్ (5 కోట్లు) మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీనే…
T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్‌లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం…
Pakistan: పాకిస్థాన్ ఆసియాకప్ గెలవకపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు రమీజ్ రాజా ఇండియన్ జర్నలిస్టుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ ఓటమితో అభిమానులు నిరాశకు గురయ్యారు..మీరు వారికి ఏం సందేశం ఇస్తారంటూ ఇండియన్ జర్నలిస్ట్ అడగ్గా.. ‘నువ్వు కచ్చితంగా భారతీయుడివై ఉంటావ్. మా ఓటమి తర్వాత భారతీయులే సంతోషంగా ఉన్నారు’ అంటూ…
IND Vs SA: ఆసియా కప్‌లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్‌లో కూడా తలపడనుంది.…