Virat Kohli: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చినట్లుంది టీమిండియా పరిస్థితి. 9 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా అభిమానులను నిరాశపరుస్తున్న భారత జట్టు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులు మాత్రం సాధిస్తూ సంతోషపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా ఇంటి దారి పట్టింది. కానీ ఈ సెమీస్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగత రికార్డుల పంట పండించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100…
Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్‌ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్‌పై 17 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్‌పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పై కూడా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన…
IPL 2023: గత రెండేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మెగా టీ20 లీగ్‌ను విదేశాల్లో నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఇండియాలోనే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు మినీ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలంలో పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్రాంచైజీకి అదనంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం ఈ రూ.5 కోట్లకు అదనం. ఐపీఎల్…
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్‌లో టీమిండియాను ఓడిస్తామని…
T20 World Cup: క్రికెట్లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్‌కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్‌కు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు…
T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా,…
టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటోంది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి సెమీఫైనల్ పోరు ప్రారంభం కానుంది. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి. గురువారం అడిలైడ్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో అడిలైడ్ వేదికగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడింది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాత్రం ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అడిలైడ్‌లో పరిస్థితులపై…