దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్డికాక్తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమార్తెకు కియారా అనే పేరు పెట్టినట్లు డికాక్ వెల్లడించాడు. ఈ మేరకు భార్య సాషా, కుమార్తె కియారాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Read Also: వాండరర్స్ టెస్ట్: భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం
కాగా ఇటీవల టెస్టు క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఆడిన అనంతరం డికాక్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. తొలి టెస్టులో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. అయితే టెస్టులతో అధిక భారం పడుతున్న నేపథ్యంలో భార్య, కుమార్తెలతో ఎక్కువ సమయం గడిపేందుకుకే డికాక్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డేలు, టీ20లు మాత్రమే డికాక్ ఆడనున్నాడు. అటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున డికాక్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు.