అజేయ రికార్డు హుష్‌కాకి… ఓటమితో కొత్త ఏడాదికి స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లను గెలిచి.. మరో మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అయితే తొలిసారిగా ఈ పర్యటనలో జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మైదానంలో టీమిండియా అజేయ రికార్డుకు బ్రేక్ పడింది.
Read Also: తండ్రి అయిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డికాక్
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
మరోవైపు కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన భారత్ ముందు ఈ ఏడాది చాలా సవాళ్లు ఉన్నాయి. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంకలతో సిరీస్‌లతో పాటు ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్… ఇలా చాలా మ్యాచ్‌లు భారత్ ఆడాల్సి ఉంది. ఆయా మ్యాచ్‌లలో ఫలితాలు అనుకూలంగా రావాలంటే పటిష్ట జట్టును ఏర్పాటు చేసుకోవాలి. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంతో అతడు ఏ మేరకు రాణిస్తాడో కాలమే సమాధానం చెప్పాలి. అయితే భారత బౌలర్లు తరచూ గాయాలపాలవుతున్నారు. దీంతో జట్టును పదేపదే మార్చాల్సి రావడంతో ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. బౌలింగ్ విషయంలో బుమ్రా, షమీ, ఇషాంత్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే భారత్‌కు విజయాలు దక్కుతాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!