దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు. Read…
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది.…
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. Read Also: IND Vs SA:…
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. రెండో రోజు ఆటను పూర్తిగా అడ్డుకున్నాడు. దీంతో రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు కాగా తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికాపై…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల…
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఓపెనర్లు రాణించడంతో…
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకున్న కోహ్లీ తాజాగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గాడు. దీంతో…
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం దక్కింది. ఈ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా… ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (60), కేఎల్ రాహుల్ (51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తొలి వికెట్‌కు వీరి జోడి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 117 పరుగుల వద్ద మయాంక్ అవుటయ్యాడు. Read Also: త్వరలో రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన పుజారా ఒక్కబంతికే క్యాచ్…
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము…
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్…