Johannesburg: రెండో టెస్టుకు వరుణుడి ఆటంకం.. నాలుగోరోజు ఆట ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది.
Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?
Also Read
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా ధీటుగా స్పందించి 229 పరుగులు చేసింది. దీంతో 27 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమిండియా 266 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసేస్తే దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ప్రొటీస్ జట్టు 118 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత బౌలర్లు విజృంభించాల్సి ఉంది. బౌన్స్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బుమ్రా, షమీ రాణించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!